Prabhas:తెలుగు దర్శకుల సంఘానికి భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్ చిత్ర పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉంటారనే సంగతి తెలిసిందే. అందరినీ డార్లింగ్ అంటూ అప్యాయంగా పలకరిస్తారు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుంటారు. గతంలో ఏపీలో అనూహ్య వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేశారు. అలాగే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి భారీ విరాళం అందించారు.
దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4ను 'డైరెక్టర్స్ డే'గా జరుపుకుంటున్నట్లు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (Telugu Film Directors Association) ప్రకటించింది. ఇక నుంచి ప్రతి ఏడాదీ దాసరి జయంతికి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో భారీగా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్.. తెలుగు దర్శకుల సంఘం సంక్షేమ నిధికి ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సోమవారం 'డైరెక్టర్స్ డే' ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి... ప్రభాస్ విరాళం అందించిన విషయాన్ని తెలియజేశారు. దీంతో ప్రభాస్‌కి అసోసియేషన్ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న 'కల్కి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని చెబుతూ పొడవాటి జట్టు, పిలకతో స్టైలిష్‌గా ఉన్నాడు. కాగా ఈ మూవీతో పాటు మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' చిత్రంలోనూ నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' అనే చిత్రంలో నటించననున్నాడు. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. మొత్తానికి ప్రభాస్ లైన్ అప్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout