ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్
- IndiaGlitz, [Tuesday,December 18 2018]
రాయదుర్గం పరిధిలోని శేరిలింగం పల్లిలో సర్వే నెం 46లో 84 ఏకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. దీనిపై తహసీల్దారు చర్యలు చేపడితే సదరు భూమిని కొన్న ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. క్రింద రెండు కోర్టులు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో తహసీల్దారు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మూడు నెలలు క్రిందటే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా, ఇప్పుడు తహసీల్దారు చర్యలు చేపట్టారు. ఈ ఆక్రమణల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉండటం గమనార్హం. గెస్ట్ హౌస్‌ను కూల్చి వేయకుండా, ముందుగా నోటీసులు అతికించారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాటు చేస్తామని తహసీల్దారు చెప్పారు. ఈ ప్రాంతంలో 2200 గజాల ఫామ్ హౌస్ ఉంది.