యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...ఓ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? గోపీచంద్ తో జిల్ సినిమాని తెరకెక్కించిన రాధాక్రిష్ణ కుమార్.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రాధాక్రిష్ణ కుమార్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ..ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదట.దీంతో రాధాక్రిష్ణ ప్రభాస్ కి కథ చెప్పాడట. కథ విని ప్రభాస్ కొన్ని మార్పలుతో ఓకె చెప్పినట్టు సమాచారం.
బాహుబలి 2 షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత రాథాక్రిష్ణతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. జిల్ సినిమా సక్సెస్ కాకపోయినా..రాథాక్రిష్ణ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments