పెదనాన్నకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు...త‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌నేది ఎప్ప‌టి నుంచో కోరిక‌. ఈ సినిమా కోసం గ‌త కొన్ని రోజులుగా క‌ధా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ప్ర‌భాస్ బాహుబ‌లి 2 లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే పెద‌నాన్న కృష్ణంరాజు డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ సినిమా ఉంటుంద‌నుకున్నారు. కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం...బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ చేయాల్సిన సినిమాలు చాలా ఉండ‌డంతో బాహుబ‌లి 2 షూటింగ్ జ‌రుగుతుండ‌గానే పెద‌నాన్న‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట ప్ర‌భాస్. ప్ర‌భాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ బ్యాన‌ర్, యు.వి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయ‌ట‌. అయితే యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఏ త‌ర‌హా చిత్రం తీస్తున్నార‌నేది తెల‌యాల్సి ఉంది.