ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్ని డైరెక్టర్

  • IndiaGlitz, [Wednesday,May 25 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో స‌రైనోడు సినిమా తెరకెక్కించి బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన స‌క్సెస్ ఫుల్ బోయ‌పాటి శ్రీను త‌దుప‌రి చిత్రాన్ని యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయ‌నున్న‌విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...స‌రైనోడు తో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో బోయ‌పాటి తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నార‌ట‌. బోయ‌పాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తీసే సినిమా త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో ఓ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇటీవ‌ల ప్ర‌భాస్ కి బోయ‌పాటి ఓ క‌థ చెప్పార‌ట‌. క‌థ విని ప్ర‌భాస్ బోయ‌పాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.