ప్రభాస్ గోల్డెన్ హార్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
కుడి చేత్తో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకూడదని అంటారు. ఆ విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలన్నది ప్రభాస్ సిద్ధాంతం. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎంత దాచినా బయట పడి పోతుంటాయి. తాజాగా ప్రభాస్ విషయంలో జరిగింది కూడా అదే. ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి2 సినిమా కోసం కండలు పెంచే పనిలో ఉన్నారు.
ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని జీసస్ హోమ్ కి రూ.5లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆ ఆశ్రమంలో ఉన్నవారి సంక్షేమార్థం ప్రభాస్ చెక్కు రూపంలో ఇచ్చారు. ఆంధ్రా బ్యాంక్ చెక్కును అక్కడి పనిచేసే ఎంప్లాయీ గుర్తించి పబ్లిక్‌గా విషయాన్ని చెప్పేశారు. గుప్తదానాలు చేయడానికి ఇష్టపడే ప్రభాస్‌కు ఈ విషయం బయటకు తెలియడం నచ్చేలేదు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఆయన మంచి మనసును మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com