విలన్ సతీమణికి... ప్రభాస్ గిఫ్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంచి తనం గురించి ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. ఎన్నో వెరైటీలు బలవంతంగా తినిపిస్తాడని కొందరు చెప్పారు. ఎనీ టైమ్ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారని మరికొందరన్నారు. తను షూటింగ్ చేసిన 50 రోజులూ తనకు ప్రభాస్ ఇంటినుంచే భోజనం వచ్చిందని మురళీశర్మ చెప్పారు.
ఇక శ్రద్ధాకపూర్ తనకు తెలుగు నేర్పడంలో ప్రభాస్ సాయపడ్డారని చెప్పింది. `సాహో`కి పనిచేసిన మిగిలిన వాళ్లు కూడా ఎవరికి తోచింది వాళ్లు చెప్పారు. తాజాగా ఆ సినిమాలో విలన్ వంతు వచ్చింది. `సాహో`లో నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ గురించి నీల్ నితిన్ ముఖేష్ తన మనసులోని మాటలు పంచుకున్నారు.
``ప్రభాస్ చాలా వినయశీలి. సౌమ్యంగా ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఆయనకు మనుషులకు విలువ ఇవ్వడం తెలుసు. ఎదుటి వ్యక్తిని చాలా గౌరవంగా చూస్తారు. `సాహో` షూటింగ్ చేస్తున్నప్పుడు నా భార్య రుక్మిణి గర్భవతి. మేం అబుదాబిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్‌కి ఈ విషయం చెప్పాను. ఆయన వెంటనే నా భార్యను కలిసి, ఎన్నో అద్భుతమైన బహుమతులు ఇచ్చారు. ఆయన మంచి మనసును మా కుటుంబం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది`` అని అన్నారు. అంతేకాదు, `సాహో` కథను సుజీత్ నెరేట్ చేసిన తర్వాత, చాన్నాళ్లు నీల్‌కి పిలుపు వెళ్లలేదట. దాంతో ఆ సినిమా నుంచి అతన్ని తీసేశారని అనుకున్నారట నీల్. కానీ చివరికి కాల్షీట్ కేటాయించమని పిలుపు వచ్చేసరికి ఆనందించారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout