షూటింగ్‌కు సిద్దమవుతున్న ప్రభాస్.. సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘సాహో’ అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేకపోవడంతో ఈ సినిమాపై ప్రభాస్ మరింత దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్టు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డేలతో భారీ, అందమైన షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభం కాబోతోంది’’ అని రాధాకృష్ణ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. తర్వాతి షెడ్యూల్‌ను జార్జియాలో ప్లాన్ చేశారు. అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా సినిమా షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పలు జాగ్రత్తల నడుమ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com