Prabhas:ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 'సలార్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పోస్టర్స్, చిన్న వీడియో గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు 'సలార్'(Salaar) ట్రైలర్ విడుదలకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల కానుందని.. డిసెంబర్ 22న మూవీ విడుదల కానుందని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దీంతో ట్రైలర్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాతో పాటు 'సలార్' ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ప్రభాస్‌తో సందీప్ రెడ్డి 'స్పిరిట్' సినిమాను తీయనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ'(Dumki) సినిమాను విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది షారుఖ్ నటించిన 'పఠాన్'(Pathaan), సెప్టెంబర్‌లో విడుదలైన 'జవాన్'(Jawan) చిత్రాలు రూ.1000కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
'సలార్' మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. విలన్‌గా వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ జగపతి బాబు, శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక 'సలార్' డిసెంబర్ 22 విడుదల కానుండటంతో వెంకటేష్ 'సైంధవ్' వచ్చే ఏడాది జనవరి 13కు పోస్ట్ పోన్ అయింది. నితిన్-వక్కంతం వంశీ 'ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్' మూవీ డిసెంబర్ 8.. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' డిసెంబర్ 7న విడుదల కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments