Prabhas:ఇది కదయ్యా ప్రభాస్ రేంజ్ అంటే.. థియేటర్ల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ..

  • IndiaGlitz, [Tuesday,December 19 2023]

సలార్.. సలార్.. దేశంలో ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే మాట. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన మూవీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్‌తో అభిమానులు పిచ్చెక్కిపోయారు. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామని ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం కళ్లు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది.

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. అంతే టికెట్ల కోసం హాల్ బయట కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఈ సినిమా నైజాం రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ థియేటర్లలో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దాంతో టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు.

ఇవాళ లేదా రేపటి నుంచి ఏపీలో కూడా బుకింగ్స్ మొదలుకానున్నట్లు సమాచారం. అలాగే టికెట్ రేటును 50 రూపాయల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో 'సలార్' బుకింగ్స్ రికార్డ్ కూడా సృష్టించాయి. ఇక నార్త్ ఇండియా, తమిళనాడు, కర్ణాటకలోనూ బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

ఇదిలా ఉంటే మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటూ చెప్పుకొచ్చారు. ఫైనల్ అవుట్ ఫుట్ చూసి మార్పులు చేయాలా అని చూసుకోలేని పరిస్థితి తనదన్నారు. కేజీఎఫ్‌కి అలానే అయిందని.. ఇప్పుడు సలార్‌కి అలాగే జరిగిందన్నారు. అయినా కానీ ఫైనల్ అవుట్ ఫుట్‌పై ఆనందంగానే ఉన్నానని పేర్కొన్నారు. అలాగే తనకు OCD సమస్య ఉండటంతో ఎక్కువ కలర్స్ చూడలేనని.. అందుకే తన సినిమాలు డార్క్‌గా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప కేజీఎఫ్‌, సలార్‌కు సంబంధం లేదని స్పష్టంచేశారు.

ఇక విడుదలకు ముందే మూవీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనిని దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నింటిలో అత్యధిక ధర పలికిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, టిన్ను ఆనంద్, రావు రమేశ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More News

Siddaramaiah:కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)

Modi, Sonia Gandhi: టార్గెట్ సౌత్.. తెలంగాణ నుంచి ప్రధాని మోదీ, సోనియా గాంధీ పోటీ..?

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మరోమారు అధికారం కాపాడుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్

Hanuman:విజువల్ ట్రీట్‌గా 'హనుమాన్' ట్రైలర్

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో 'హనుమాన్'  ఒకటి. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో

Somireddy:మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష భగ్నం.. భారీగా తరలివచ్చిన హిజ్రాలు..

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ ఆపేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy)

China:చైనాలో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి..

చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం(China Earthquake) సంభవించింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో