ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ.. యూవీ క్రియేషన్సే టార్గెట్, నిద్రపోతున్నారా అంటూ ట్రోలింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి వంటి ఒక సునామీ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. యావత్ భారతదేశాన్నే షేక్ చేసిన ఒక మెగా హిట్ తర్వాత అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ అంచనాలు భారీగా వుంటాయి. కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ, స్వయంగా ప్రభాస్ మిత్రులు నిర్మాతలుగా వున్న ‘‘యూవీ క్రియేషన్స్ ’’ నిర్లక్ష్య వైఖరి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రాధేశ్యామ్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటమే కాకుండా .. రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. అయితే రాధేశ్యామ్ వాయిదా పడటంపై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ సంగతి పక్కనబెడితే.. కనీసం సినిమా గురించి అప్‌డేట్స్ లేకపోవడం మరింత అసంతృప్తిని కలిగించింది. దీంతో ఒక అభిమాని ఏకంగా సూసైడ్ నోట్ రాసి .. తన చావుకు యూవీ క్రియేషన్సే కారణమని ఆరోపించాడు.
మరి ఈ కారణమో లేక మరేదో కానీ యూవీ క్రియేషన్స్ మొదటి పాట రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఈ విషయంలో కూడా మేకర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు పాట వదులుతామని రెండు రోజులుగా సోషల్ మీడియాలో క్యాంపెన్ రన్ చేశారు. చెప్పినట్లుగానే సాయంత్రం 5 గంటల కోసం అభిమానులంతా వెయిట్ చేశారు. కానీ మళ్లీ యూవీ క్రియేషన్స్ చేతులెత్తేసింది. అంతే అభిమానుల ఆగ్రహం నషాళానికి అంటింది. ట్విట్టర్లో గోల గోల చేశారు. కొందరైతే ఏకంగా హైదరాబాద్ పోలీసులకు టాగ్ చేస్తూ యువి క్రేయేషన్స్ టీంని అరెస్ట్ చెయ్యమని పోస్ట్ చేశారు.
దీంతో తప్పుని గ్రహించిన యూవీ క్రియేషన్స్.. సాంకేతిక కారణాల వల్ల రాత్రి 8 గంటలకు అప్‌లోడ్ చేస్తామని చెప్పింది. సరేలే సరిపెట్టుకుందామనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే. రాత్రి 8 గంటలకు కూడా పాట రాలేదు. 9 గంటల ప్రాంతంలో టీ సిరీస్ సంస్థ యూట్యూబ్‌లో పాట పెడితే ఫ్యాన్స్ షేర్లు చేసుకోవడంతో ట్విట్టర్ మోతెక్కిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో దీనిని యూవీ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అయితే జస్టిన్ ప్రభాకరన్ మేజిక్‌తో అభిమానులు ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘‘రాధేశ్యామ్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ థియేటర్స్‌లో సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout