ప్రభాస్ అభిమానులకు నిరాశే... జాన్ రిలీజ్ కు మరో ఏడాది ?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్.... పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ తెచ్చుకున్న రెబల్ స్టార్. ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు దర్శకుడు రాజమౌళికే రాసిచ్చేసిన ప్రభాస్ ... ఆ తర్వాత భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన సాహో సినిమాకు రెండు సంవత్సరాలు స్పెండ్ చేశాడు. దీంతో తమ హీరో నుంచి ఒక్క సినిమా రావాలంటే ఏళ్లకు ఏళ్లు వేచి చూడాల్సి వస్తుంది ప్రభాస్ అభిమానులు.
అయితే సాహో తర్వాత జిల్ ఫేం రాధాకృష్ఱ దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా జాన్. సాహో మూవీ సెట్స్ మీద ఉండగానే జాన్ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్. దీంతో సాహో తర్వాత వెంటనే జాన్ రిలీజ్ అవుతుంది అనుకున్నారు ఫ్యాన్స్. కానీ వారి ఆశ నిరాశగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే జాన్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. కానీ సాహో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్... సెకండ్ షెడ్యూల్ ఇంక ప్రారంభించలేదు. అంటే ఈ సినిమా థియేటర్లకు రావాలంటే మరో ఏడాది వేచిచూడక తప్పదనిపిస్తోంది.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గోపికృష్ఱ మూవీ బ్యానర్ పై యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కనీసం దసరా కైనా రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ క్రియేట్ చేస్తోంది యూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com