పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీ వరద బాధితులకు రూ.కోటి విరాళం, అభిమానుల ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. సర్వం కోల్పోయి నిరాశ్రయిలైన అభాగ్యులకు చేయూతను అందించడానికి తారా లోకం కదిలింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు తమ వంతుగా తలో రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. నలుగురికి సాయం చేయడంలో ఒక అడుగు ముందే వుండే ప్రభాస్.. తోటి హీరోల కంటే ఎక్కువగానే ఏకంగా రూ.కోటిని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
త్వరలో ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రభాస్ ఇలా భారీ మొత్తం విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కరోనా సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి... అటు ఏపీ , తెలంగాణ సీఎంల సహాయనిధికి... మొత్తం 4.5 కోట్ల రూపాయలు విరాళంగా అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. అలాగే గతేడాది హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినప్పుడూ కూడా ప్రభాస్ విరాళం అందించారు. తాజాగా ఇప్పుడు ఏపీ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో... ఆయనపై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటిస్తున్న... 'రాధే శ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout