సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతంలోని ఎంతో కొంత భాగం నీట మునిగింది. ఇక పాతబస్తీ అయితే చాలా వరకూ జల దిగ్బంధంలో ఉండిపోయింది. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి తాము అండగా ఉన్నామంటూ టాలీవుడ్‌ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

ఈ కష్ట కాలంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించి ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, హీరో రామ్, విజయ్ దేవరకొండ, హారిక హాసిని క్రియేషన్స్ దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

More News

పవన్ రూ.కోటి విరాళం

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.

అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ

కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణకు విరాళం ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు..

భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతికి బెదిరింపు

అసలు మనుషులు ఏమైపోతున్నారు.. మానవత్వం కనపడటం లేదేంటి?

'నర్తనశాల' బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన  పౌరాణిక చిత్రం `న‌ర్త‌న‌శాల`.