Prabhas : మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు శనివారం భద్రాచలం ఆలయ ఈవో ఎల్ రామాదేవికి చెక్కును అందజేశారు. ఈ సొమ్మును భద్రాద్రి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించుకుంటామని ఈవో కోరగా.. అందుకు ప్రభాస్ అంగీకరించినట్లుగా సమాచారం.
విజువల్ వండర్‌గా ఆదిపురుష్:
ఇకపోతే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘‘ఆదిపురుష్’’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నేటికాలానికి తగినట్లుగా ఆధునిక టెక్నాలజీ , విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండీయర్‌గా ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా విజయవంతం కావాలని యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జూన్ 16న ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ :
ఇకపోతే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com