పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా టైమ్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కొన్నాళ్ల పాటు ఆగాయి. అయితే దిల్‌రాజు, నిఖిల్ వంటి వారు కరోనా నిబంధనల మేరకు పెళ్లి చేసుకున్నారు. దీంతో మరికొందరు అదే బాటలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో యువ దర్శకుడు సుజిత్ కూడా చేరారని వార్తలు వినపడుతున్నాయి. తను ప్రేమించిన అమ్మాయిని సుజిత్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినపడుతున్నాయి. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ నెల 10న వీరి ఎంగేజ్‌మెంట్ ఉంటుందని అంటున్నారు.
షార్ట్ ఫిలింస్ చేసిన సుజిత్ తొలి చిత్రం ‘రన్‌రాజారన్’..శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దీంతో సుజిత్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. తదుపరి ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రభాస్, సుజిత్ కాంబోలో వచ్చిన చిత్రం ‘సాహొ’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే కూడా సుజిత్‌కు ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్‌ను సుజిత్ తెరకెక్కించున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉంది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత చిరు సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు సుజిత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments