close
Choose your channels

Prabhas:డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ : ప్రాజెక్ట్ కే గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా..!!

Friday, July 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. భారీ బడ్జెట్‌తో పాటు ఇండియాలోని పలు చిత్ర పరిశ్రమలకు చెందినవారితో తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కే అంటూ వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుుంటున్న ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటీ..? ప్రభాస్ లుక్ ఎలా వుండబోతోంది అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించారు మేకర్స్. అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ 2023 వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

సూపర్ హీరోగా ప్రభాస్ :

ఈ చిత్రానికి ‘‘కల్కి 2898 ఏడీ’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రపంచాన్ని దుష్ట శక్తి కమ్మేసినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం ఆరంభమవుతుందని ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఈ శక్తిగా ప్రభాస్‌ను చూపించారు. కథలో టైమ్ ట్రావెలింగ్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చారు. అలాగే హీరోయిన్ దీపికా పదుకొణేను కూడా గ్లింప్స్‌లో చూపించారు. ప్రభాస్ సూపర్ హీరో లుక్‌లో బాగున్నారు. వాటీజ్ ప్రాజెక్ట్ కే అనే డైలాగ్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. విజువల్ ఎఫెక్ట్స్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ , యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ కట్టిపడేశాలా వున్నాయి.

జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ప్రాజెక్ట్ కే :

ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకోణే నటించనున్నారు. దిశా పటానీ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు . ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారు. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాజన్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తూ వుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment