15 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ప్ర‌భాస్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో వ‌రల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అయిన మ‌న తెలుగు క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌. అలాంటి ప్ర‌భాస్ కి ఇవాళ ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం 15 ఏళ్ల క్రితం ఇదే తేదిన ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌రి. ఈశ్వ‌ర్ పేరుతో విడుద‌లైన ఆ సినిమాలో ప్ర‌భాస్.. ధూల్ పేట్ కుర్రాడిగా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

అప్ప‌టికే చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన జ‌యంత్ సి.ప‌రాన్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం.. అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న‌ల్ న్యూస్ అయ్యింది. ప్ర‌ముఖ న‌టులు విజ‌య్ కుమార్‌, మంజుల కుమార్తె శ్రీ‌దేవి క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి రేవ‌తి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ సంగీత‌మందించిన ఈ చిత్రం.. న‌వంబ‌ర్ 11, 2002న విడుద‌లైంది.

తొలి చిత్రంతోనే రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించిన ప్ర‌భాస్‌.. బాహుబ‌లితో ఊహ‌కంద‌ని స్థాయికి ఎదిగారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంతో.. ప్ర‌భాస్ స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్ జంట

ఈ జనరేషన్లో తెలుగులో అభిమానుల సంఖ్యను గణనీయంగా ఏర్పరచుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తి ఒకరు. మరోవైపు రకుల్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'

వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'.

గ‌రుడ‌వేగ‌కి సూప‌ర్‌స్టార్మ‌ హేష్‌బాబు ప్ర‌శంస‌...

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం'.

హాలీవుడ్ వెళ్తున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్ట‌ర్స్ స్ట‌డీ చేయాల‌నుకుంటున్నారు. వాళ్ల‌కు అనువుగా ఉండేలా ప్ర‌భాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు.

'అర్జున్‌రెడ్డి' త‌మిళ టైటిల్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది తెలుగులో విడుద‌లైన అర్జున్ రెడ్డి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా 5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది 50 కోట్లు క‌లెక్ట్ చేసి పెద్ద హిట్ అయ్యింది.