లగ్జరీ కారు కొన్న ప్రభాస్.. దాని ధర ఎంతో తెలిస్తే...
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యారు. ఇక అక్కడ నుంచి ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్‌పైనే దృష్టి సారించాడు. డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘రాధేశ్యామ్’ చిత్రంతో లవర్ బాయ్‌గా కనిపించనున్న ప్రభాస్.. ‘సలార్’లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించనున్నాడు. దీంతో పాటు ‘ఆదిపురుష్’ అనే పౌరాణిక చిత్రంలోనూ నటిస్తున్నాడు. మొత్తానికి వరుస సినిమాలతో ప్రభాస్ అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే సాధారణంగా సెలబ్రెటీలకు కార్లంటే క్రేజ్ విపరీతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రభాస్‌కి కూడా కార్లంటే చాలా ఇష్టమట. దీంతో ఇప్పటికే ప్రభాస్ దగ్గర బీఎమ్‌డబ్ల్యూ 520డి, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ మరో కొత్త కారు కొన్నాడని సమాచారం. ప్రభాస్ లంబోర్గిని కారు కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంటే ఈ ఆదివారమే ఈ కారు డెలివరీ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్‌కు లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును షోరూం డెలివరీ చేసేసింది. ఇది ఇండియాలో రెండో కారని.. దీనిని సక్సెస్ ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ సంస్థ చెప్పుకొచ్చింది.
హీరో ప్రభాస్ కొత్త కారు లంబోర్గిని అవెన్‌టోడోర్ ఎస్ రోడ్‌స్టర్ కలర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అరాంచో అట్లాస్ షేడ్ కలర్‌లో ఈ కారు ఆకట్టుకుంటోంది. రూ.6కోట్లకు పైగా దీని ధర ఉండటంతో పాటు... ఇండియాలోనే ఈ కారు కొన్న రెండో వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం.. బెంగళూరులోని లంబోర్ఘిని షోరూమ్ నుంచి హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటికి ఆదివారం కారు డెలివరీ ఇవ్వడం పూర్తై పోయింది. కారును డెలివరీ చేసిన మరుక్షణమే ప్రభాస్ తన కొత్త కారుతో హైదరాబాద్ రోడ్లు మీద చక్కర్లు కొట్టాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments