యువ హీరోతో యువీ క్రియేషన్స్ డీల్.. తెరవెనుక ప్రభాస్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ యువ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే సంతోష్ శోభన్. ఇటీవల ఓటిటీలో విడుదలైన ఏక్ మినీ కథ చిత్రంలో సంతోష్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ శోభన్.. వర్షం చిత్రంతో ప్రభాస్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శోభన్ తనయుడు.
దర్శకుడు శోభన్ 2008 లో అకాల మరణం చెందారు. ప్రస్తుతం శోభన్ తనయుడు సంతోష్ ఇండస్ట్రీలో హీరోగా రాణించేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. శోభన్ ని ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో నిలబెట్టే బ్యాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. అందుకే సంతోష్ సినిమాల ప్లానింగ్ ని ప్రభాస్ తెరవెనుక ఉండే చేస్తున్నాడు.
ఇదీ చదవండి: చిరంజీవి 'కింగ్ మేకర్'.. ఇదే ఫైనల్!
అందుకే శోభన్ ని తన స్నేహితుల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ లోకి తీసుకువచ్చాడు. యువి సంస్థ కథా బలమున్న చిన్న చిత్రాలని నిర్మించేందుకు యువీ కాన్సెప్ట్స్ అనే కొత్త బ్యానర్ ప్రారంభించింది. ఏక్ మినీ కథ చిత్రాన్ని అందులోనే తెరకెక్కించారు.
శోభన్ నటించబోయే తదుపరి రెండు చిత్రాలని కూడా యువి కాన్సెప్ట్స్ సంస్థే నిర్మించనుంది. కెరీర్ కి ఆరంభమే కీలకం కనుక సంతోష్ తొలి మూడు చిత్రాల బాధ్యతని ప్రభాస్ తీసుకున్నాడని టాక్. తెరవెనుకే ఉండి సంతోష్ ని గైడ్ చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com