ప్రభాస్‌పై కరోనా ఎఫెక్ట్..!

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇప్పుడీ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు.. కరోనా అనుమానితులు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై కూడా కరోనా ప్రభావం పడింది. షూటింగ్ నిమిత్తం యూరఫ్ వెళ్తూ ప్రభాస్ తన ముఖానికి మాస్క్ ధరించాడు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇలా మీడియా కెమెరాలకు చిక్కాడు. చాలా వేగంగా నడుస్తూ ప్రభాస్ కనిపించాడు. కాగా.. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందనే సందేశాన్ని ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చినట్టయిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు మాస్కులు ధరించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని పలువురు అభిమానులు చెబుతున్నారు.

కాగా.. ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దే నటిస్తోంది. అయితే కరోనా కలకలంతో ప్రభాస్ సినిమా యూనిట్‌లో కలవరం మొదలైంది.