ప్రభాస్.. పదేళ్ళ తరువాత
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న సాహో చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల కానుంది.
అలాగే.. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నారు ప్రభాస్. ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి వచ్చే అవకాశముంది. అంటే.. ఒకే ఏడాదిలో ప్రభాస్ హీరోగా రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట.
ఒక రకంగా ప్రభాస్ అభిమానులకు ఇది శుభవార్తే. ఎందుకంటే.. గత పదేళ్ళుగా ఏడాదికో సినిమా లేదంటే రెండేళ్ళకో సినిమా అన్నట్లుగానే ప్రభాస్ నుంచి సినిమాలు వస్తున్నాయి. 2004, 2005, 2007, 2009 సంవత్సరాల్లో మాత్రమే రెండేసి సినిమాలతో పలకరించిన ప్రభాస్.. మళ్ళీ పదేళ్ళ తరువాత 2019లో రెండు చిత్రాలతో సందడి చేయనుండడం విశేషమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com