Adipurush:డార్లింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఏకంగా 70 దేశాల్లో స్పెషల్ స్క్రీనింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు , ఫస్ట్ లుక్ వచ్చాక అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక.. అందులోని పాత్రల తీరుతెన్నులు చూశాక అభిమానులు, సినీ విశ్లేషకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో నాలుక కరచుకున్న ఆదిపురుష్ యూనిట్ పాత్రల గెటప్ మార్చే యత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
భారత్‌తో పాటు 70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ :
ఈ క్రమంలో చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. జూన్ 16న ఆదిపురుష్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ విషయంలోనూ చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9న ఆదిపురుష్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని శనివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. భారత్‌తో పాటు పలు దేశాల్లోని థియేటర్స్‌లో ఆదిపురుష్ ట్రైలర్‌ను స్పెషల్ స్క్రీనింగ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ సహా దాదాపు 70 దేశాలలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. మరి ఆదిపురుష్ ట్రైలర్ ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.
జూన్ 16న ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ :
ఇకపోతే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout