Adipurush Trailer : ‘‘వేల ఏళ్ల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్పుకోవాలి’’.. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసిందోచ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు , ఫస్ట్ లుక్ వచ్చాక అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక.. అందులోని పాత్రల తీరుతెన్నులు చూశాక అభిమానులు, సినీ విశ్లేషకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో నాలుక కరచుకున్న ఆదిపురుష్ యూనిట్ పాత్రల గెటప్ మార్చే యత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. జూన్ 16న ఆదిపురుష్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ విషయంలోనూ చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9న ఆదిపురుష్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని శనివారం అధికారికంగా ప్రకటించింది.
భారతీయుల ఇతిహాసం రామాయణం:
అన్నట్లుగానే మంగళవారం ఆదిపురుష్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. భారతీయులకు రామాయణం గురించి కొత్తగా చెప్పేదేముంది. రాముడి పుట్టుక , వ్యక్తిత్వం, తండ్రి మాటను జవదాటని వైనం, అరణ్యవాసం, సీతతో ఎడబాటు, హనుమంతునితో రాముడికి పరిచయడం, కిష్కిందకాండ, లంకా దహనం, సీతను రావణుడు అపహరించడం, రామ రావణ యుద్ధం, అగ్ని ప్రవేశం, శ్రీరామ పట్టాభిషేకం. ఇలా ప్రతి విషయం భారతీయులకు తెలియనది కాదు. దీనినే ఆదిపురుష్‌లోనూ చూపించారు. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి రామాయణాన్ని తెరకెక్కించాయి.
ట్రైలర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న యూనిట్ :
అయితే నేటికాలానికి తగినట్లుగా ఆధునిక టెక్నాలజీ , విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండీయర్‌గా ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ బాగున్నారు. ‘‘రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనస్సు విరిచాడు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి’’. ‘‘నా కోసం పొరాడొద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి.. ఆ రోజు కోసం పోరాడండి’’ అంటూ చెప్పే డైలాగ్స్ కూడా బాగున్నాయి. టీజర్ నాటి తప్పు మళ్లీ జరగకుండా.. నెటిజన్లు, విమర్శకుల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ట్రైలర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్.
జూన్ 16న ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ :
ఇకపోతే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com