Adipurush Trailer : ‘‘వేల ఏళ్ల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్పుకోవాలి’’.. ఆదిపురుష్  ట్రైలర్ వచ్చేసిందోచ్

  • IndiaGlitz, [Tuesday,May 09 2023]

భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు , ఫస్ట్ లుక్ వచ్చాక అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక.. అందులోని పాత్రల తీరుతెన్నులు చూశాక అభిమానులు, సినీ విశ్లేషకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో నాలుక కరచుకున్న ఆదిపురుష్ యూనిట్ పాత్రల గెటప్ మార్చే యత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. జూన్ 16న ఆదిపురుష్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ విషయంలోనూ చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9న ఆదిపురుష్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని శనివారం అధికారికంగా ప్రకటించింది.

భారతీయుల ఇతిహాసం రామాయణం:

అన్నట్లుగానే మంగళవారం ఆదిపురుష్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. భారతీయులకు రామాయణం గురించి కొత్తగా చెప్పేదేముంది. రాముడి పుట్టుక , వ్యక్తిత్వం, తండ్రి మాటను జవదాటని వైనం, అరణ్యవాసం, సీతతో ఎడబాటు, హనుమంతునితో రాముడికి పరిచయడం, కిష్కిందకాండ, లంకా దహనం, సీతను రావణుడు అపహరించడం, రామ రావణ యుద్ధం, అగ్ని ప్రవేశం, శ్రీరామ పట్టాభిషేకం. ఇలా ప్రతి విషయం భారతీయులకు తెలియనది కాదు. దీనినే ఆదిపురుష్‌లోనూ చూపించారు. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి రామాయణాన్ని తెరకెక్కించాయి.

ట్రైలర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న యూనిట్ :

అయితే నేటికాలానికి తగినట్లుగా ఆధునిక టెక్నాలజీ , విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండీయర్‌గా ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ బాగున్నారు. ‘‘రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనస్సు విరిచాడు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి’’. ‘‘నా కోసం పొరాడొద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి.. ఆ రోజు కోసం పోరాడండి’’ అంటూ చెప్పే డైలాగ్స్ కూడా బాగున్నాయి. టీజర్ నాటి తప్పు మళ్లీ జరగకుండా.. నెటిజన్లు, విమర్శకుల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ట్రైలర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్.

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ :

ఇకపోతే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు.

More News

Kushi:'ఖుషీ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. విజయ్, సమంతల కెమిస్ట్రీ సూపర్బ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషీ’’.

Inter Results:తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి, ఉత్తీర్ణత శాతం ఏంతంటే..?

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

Katha Venuka Katha:మే 12న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ రిలీజ్

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

Pawan Kalyan:మహారాష్ట్రలో 'ఓజీ' షూటింగ్.. పవన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన జనసైనికులు, పవర్‌స్టార్ లుక్ వైరల్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ప్రణాళికాబద్ధంగా

Delhi Liquor Scam:ఆరోపణలు సరే.. ఆధారాలేవి, అసలు నేరం జరిగిందా : ఢిల్లీ లిక్కర్ స్కాంపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.