ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ సినిమాల్లో వినియోగించే ఈ టెక్నాలజీని ఓం రావుత్ ‘ఆదిపురుష్’ కోసం వినియోగిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. మంగళవారం ఈ సినిమా లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రావుత్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
‘‘ఆది పురుష్’ ఆరంభ్’ అని ఓం రావుత్ ట్వీట్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను పోస్ట్ చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ క్యాస్టింగ్‌ను ఓం రావుత్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే హేమమాలినిని సైతం ఓ పాత్రం కోసం తీసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆమె రాముడి తల్లి లేదంటే పిన తల్లి పాత్రలో నటించనున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.
గుల్షన్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిలింస్, రెట్రోఫిలిస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రీకరణను పూర్తి చేస్తున్నాడు. మరో వైపు 'సలార్' రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో ‘ఆదిపురుష్’ అంటే ప్రభాస్‌కు చాలా పెద్ద టాస్క్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com