ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ : "నా ఆగమనం .. అధర్మ విద్వంసం" .. క్లాసిక్‌లో యాక్షన్ టచ్
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. భారతీయుల ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జూన్ 16న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్, ట్రైలర్‌ను మరిపించేలా ఈ ఫైనల్ ట్రైలర్‌ను కట్ చేశారు.
నేటితరానికి తగ్గట్లుగా రామాయణం:
స్వామిజీ రూపంలో వచ్చిన రావణుడికి భిక్ష వేసేందుకు గాను సీతా దేవి లక్ష్మణుడు గీసిన గీతను దాటి ముందుకు వస్తుంది. అప్పుడు రావణుడు ఆమెను అపహరించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సీతను వెతుక్కుంటూ రాముడు బయల్దేరడం, వానర సైన్యం, సీత వద్దకు ఆంజనేయుడు, చివరిలో రామ-రావణ యుద్ధం గురించి చెప్పుకుంటూ వెళ్లారు మేకర్స్. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ గూస్ బంప్స్ తెప్పించేవిలా వున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో భారతీయ చిత్రాల్లో రామాయణాన్ని చిత్రీకరించారు. అయితే నేటి తరానికి తగ్గట్లుగా ఆధునిక హంగులతో ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. టీజర్ నాడు జరిగిన తప్పును సరిదిద్దుకుని .. ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేశారు మేకర్స్.
ఆసక్తికరంగా డైలాగ్స్ :
ఇక ఫైనల్ ట్రైలర్లో డైలాగ్స్ అదరహో అనేలా వున్నాయి. ‘‘ వస్తున్నా రావణా .. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి వస్తున్నా .. నా జానకిని తీసుకువెళ్ళడానికి’’, ‘‘నా ఆగమనం .. అధర్మ విద్వంసం’’, ‘‘ ఈరోజు నాకోసం పోరాడొద్దు.. భరత ఖండంలో పరస్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకి మీ పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి.. పోరాడతారా..’’ అంటూ రాముడు వానర సైన్యంలో స్పూర్తిని రగిలించే డైలాగ్స్ బాగున్నాయి. ఇక లంకకు వచ్చిన సీతతో ఆంజనేయుడు .. ‘‘ మీ నాతో వచ్చేయండమ్మా’’ అంటాడు. దీనికి సీత స్పందిస్తూ.. ‘‘తన ఇంటి గుమ్మలోనుంచి ఎత్తుకువచ్చాడు.. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకెళ్లినప్పుడే.. ఆయనే వస్తారు’’ అని భారతీయ నారీగా తన పౌరుషాన్ని , ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తుంది.
సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ :
చూస్తుంటే.. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కి, ఈ తరహా జోనర్లను ఇష్టపడే వారికి ఆదిపురుష్ మంచి ఫీస్ట్ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరి సీతారాముల దాంపత్యం, ఆంజనేయుడితో రాముడి స్నేహం, రావణుడితో శ్రీరాముడు యుద్ధాన్ని తెరపై చూడాల్సిందే. ఇకపోతే.. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout