ప్రభాస్ 21... కథ సిద్ధం చేసి నాగ్ అశ్విన్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. దీన్ని పూర్తి చేసిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ చేయాలనుకుంటున్నాడు. అయితే కరోనా వల్ల ఖాళీ సమయాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ వృథా చేయాలనుకోలేదు. ఈ గ్యాప్‌లోనే స్క్రిప్ట్‌ను రెడీ చేసేశాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులను మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది.
మరో పక్క ప్రబాస్ 20కి ‘రాధేశ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయట. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సగానికిపైగానే చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు. ప్రభాస్ అండ్ టీమ్ స్పీడుకు కరోనా బ్రేకులేసింది. అయితే జార్జియాలో కీలక షెడ్యూల్ పూర్తి కావడంతోలాక్డౌన్ సమయానికి అంతా టీమ్ ఇండియా చేరుకున్నారు. మిగిలిన షెడ్యూల్‌ను సెట్స్ వేసి చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com