ప్రభాస్ 21 : దేవుడు వర్సెస్ సైన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ ప్రభాస్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 20వ చిత్రం సెట్స్‌పై ఉంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను నవంబర్‌కంతా పూర్తి చేయాలని అనుకున్నారు. ఎందుకంటే నవంబర్‌లో ప్రభాస్.. .మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా చేయబోతున్నాడు.
మీడియాలో వినపడుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుందట. సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మధ్య నడిచే కథాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది చివరలో సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియడం లేదు. షూటింగ్స్ కు సంబంధించిన ఇంకా క్లారిటీ రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com