గ్యాప్‌లో.. ప్రభాస్ 21 దర్శకుడేం చేస్తున్నాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అంతా సజావుగానే సాగుతున్నసమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. ఈ ప్రభావం ప్రభాస్ 21పై పడింది. దీంతో నవంబర్‌లో ప్రారంభించాలనుకున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. దీంతో నాగ్ అశ్విన్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ దర్శకుడు ఈ గ్యాప్‌ను వృథా చేయకూడదని అనుకుంటున్నాడట. అందుకని ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలనుకున్నాడట.
సినీ వర్గాల సమాచారం మేరకు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే ఈ వెబ్ సిరీస్‌ను హీరో రానా నిర్మించబోతున్నాడట. తాత రామానాయుడు, తండ్రి సురేష్‌బాబు అడుగు జాడల్లోని రానా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడిప్పుడే రానా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఒక వైపు సినిమాల్లోనటిస్తూనే మరో వైపు కొత్త టాలెంట్‌ను, కాన్సెప్ట్‌ను ఎంకరేజ్ చేయడానికి రానా ప్లాన్ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com