OG:క్రేజీ అప్‌డేట్ : పవన్ - సుజిత్ 'ఓజీ' రిలీజ్ టైం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగే
- IndiaGlitz, [Wednesday,May 17 2023]
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ, సాయితేజ్‌తో చేస్తున్న మల్టీస్టార్ సినిమాలు వున్నాయి. వీటిలో మేనల్లుడితో సినిమాకు సంబంధించి తన షూటింగ్ పూర్తి చేశారు. ఇక మిగిలిన వాటిని కూడా వేగంగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పవన్ బిజీ కానున్నారు. దీనిని దృష్టిలో వుంచుకునే షూటింగ్‌లు త్వరగా ముగించాలని కూడా పవన్ నుంచి దర్శక నిర్మాతలకు ఆదేశాలు వెళ్లినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.
చకచకా ఓజీ షూటింగ్ :
ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ షూటింగ్‌ను చాలా స్పీడుగా చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై, మహాబలిపురంలలో చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించినట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్‌ను ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్‌గా ఈ సినిమాలో చూపించనున్నారు. ఆయన మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా నిలుస్తాయని ఫిలింనగర్ టాక్. ఇటీవల మహారాష్ట్రలోని వై లేక్ వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలో పవన్ కరాటే డ్రెస్‌లో కనిపించారు. గతంలో ఖుషి సినిమాలో ఆయన ఆ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓజీపై భారీ అంచనాలు :
సాహో తర్వాత సుజిత్ టేకప్ చేస్తున్న సినిమా కావడంతో చిత్ర పరిశ్రమలో ఓజీపై భారీ అంచనాలు వున్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో వుంది. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓజీని ఈ ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారన్నది ఆ వార్త సారాంశం. అదే నిజమైతే పవన్ అభిమానులకు పండగే. ఓజీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.