సర్ధార్ స్టెప్స్ అదరగొడుతున్నాడట...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం పవన్, లక్ష్మీరాయ్ లపై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే సర్ధార్ సెట్స్ కి దేవిశ్రీ వెళ్లాడు. అక్కడ సర్ధార్ వేస్తున్న స్టెప్స్ చూసి దేవిశ్రీ ధ్రిల్ ఫీలయ్యాడనుకుంట... సర్ధార్ రాకింగ్ ద స్టెప్స్ అంటూ ట్వీట్టర్ లో తన సంతోషాన్ని సేర్ చేసుకున్నాడు. అలాగే డైరెక్టర్ బాబీ సినిమాని బాగా తెరకెక్కిస్తున్నాడని కూడా చెప్పాడు. ఈ మూవీని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సమ్మర్ లో సర్ధార్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి...సర్ధార్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments