Pawan Kalyan:తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకునేలా .. ఫిల్మ్ ఛాంబర్ పనిచేస్తుందనుకుంటున్నా : పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన దిల్‌రాజు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు , కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు .. మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకుని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పనిచేస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ పవన్ పేర్కొన్నారు.
సీ కళ్యాణ్‌పై నెగ్గిన దిల్‌రాజు :
ఇకపోతే.. గత నెల 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నిర్మాతలు సీ.కళ్యాణ్, దిల్‌రాజులు తలపడగా.. దిల్‌రాజు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 48 ఓట్లలో 31 ఓట్లు దిల్‌రాజుకు పడటంతో ఆయన విజయం సాధించారు. ఇక ఫిలిం ఛాంబర్ ఎన్నికలు 14 రౌండ్లలో జరిగాయి. మొత్తం 891 ఓట్లకుగాను 563 ఓట్లు దిల్‌రాజుకు, సీ.కళ్యాణ్‌కు 497 ఓట్లు పడ్డాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మంది దిల్‌రాజు ప్యానెల్ నుంచి ఏడుగురు గెలిచారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానెల్. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరువర్గాలకు చెరో ఆరు దక్కాయి. చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీతో సీ . కళ్యాణ్.. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు తెలుగు చిత్ర పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు బరిలో నిలిచారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ :
ప్రెసిడెంట్ : వీ. వెంకట రమణా రెడ్డి (దిల్‌రాజు)
వైస్ ప్రెసిడెంట్స్ : ముత్యాల రామదాస్, పీ శ్రీనివాసరావు, కొల్లి రామకృష్ణ
గౌరవ కార్యదర్శులు : కేఎల్ దామోదర ప్రసాద్, కే . శివప్రసాద రావు
గౌరవ జాయింట్ కార్యదర్శులు : మోహన్ వడపట్ల, సీ .భరత్ చౌదరి, డీఎస్ఎన్ ప్రసాద్ (మోడల్ శివ), మాదాల రామకృష్ణ, పేర్ల సాంబమూర్తి
గౌరవ కోశాధికారి : తుమ్ముల ప్రసన్న కుమార్
సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్లు :
ప్రొడ్యూసర్ సెక్టార్ : శివలెంక కృష్ణ ప్రసాద్
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ : ఎం . సుధాకర్
ఎగ్జిబిటర్ సెక్టార్ : టీఎస్ రామప్రసాద్
స్టూడియో సెక్టార్ : ఈవీఎన్ చారి
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు :
1. వైవీఎస్ చౌదరి
2. సీ . కళ్యాణ్
3. జేవీ మోహన్ గౌడ్
4. కే. అశోక్ కుమార్
5. వై రవి శంకర్ (మైత్రీ రవి)
6. ఎన్. పద్మిని
7. కే. అమ్మీరాజు
8. పీవీ రవికిశోర్ (స్రవంతి రవి కిషోర్)
9. ముత్యాల రమేష్
10. పీ . భరత్ భూషణ్
11. ఏ. సత్యనారాయణ (అనుశ్రీ)
12. బీ. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
13. ఎన్. నాగార్జున
14. ఎం. వెంకటేశ్వర రావు (శాంతి)
15. ఎన్. వెంకట్ అభిషేక్ (అభిషేక్ నామా)
16. బీ. బాపిరాజు
17. వై. సుప్రియ
18. టీ.సాయి చరణ్ రెడ్డి
19. సయ్యద్ తాహీర్ అలీ
20. బీ. అంజి రెడ్డి
21. టీ. బాలా గోవింద్ రాజ్
22 . జీ. మహేశ్వర రెడ్డి (సాయి)
23. టీ. నారాయణ ప్రసాద్
24. జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్
25. బీ. రాజేశ్వర రెడ్డి
26. పీ. సీతారామ్ కుమార్
27. ముత్తవరపు శ్రీనివాస బాబు
28. ఎం. తిమ్మప్ప
29. ఏవీ. అంబికా ప్రసాద్
30. కే.వంశీ కిశోర్
31. జీ. వీర నారాయణ బాబు
32. ఎం. విజేందర్ రెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి అభినందనలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/PcLk4s4fuX
— JanaSena Party (@JanaSenaParty) August 1, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout