Powerstar Pawan kalyan:పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ .. 'ఓజీ' వీడియో వైరల్, కాన్సెప్ట్‌పై హింట్ ఇచ్చేసిన సుజిత్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మంచి జోరు మీదున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు పూర్తి కావొచ్చింది. అటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను శరవేతంగా పూర్తి చేస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఆయన తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఈరోజు వచ్చింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ముంబైలో ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ వీడియోను విడుదల చేసింది.
పవన్‌ను ఎలా చూపించేది చెప్పిన సుజిత్ :
షూటింగ్ పనులు మొదలైనట్లు సుజిత్ తాను స్క్రిప్ట్ రాసుకుంటున్న విధానం, అలాగే ఆలోచన విధానాన్ని సదరు వీడియోలో హైలైట్ చేశాడు. అందులో గ్రానైట్స్, బుల్లెట్స్, కత్తిని పట్టుకుని ఉన్న షాట్స్‌ను చూపించాడు సుజిత్. మొత్తానికి పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో ... అలా డిఫరెంట్‌గా చూపించడానికి సుజిత్ రెడీ అయినట్లుగా వీడియో చూస్తే అర్ధమవుతోంది. వచ్చే వారం పవన్ షూటింగ్లో జాయిన్ అవుతారని చివరిలో తెలిపారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది.
సాహో తర్వాత మరో సినిమా చేయని సుజిత్:
ప్రభాస్‌తో తెరకెక్కించిన సాహో నిరాశ పరచడంతో గత మూడేళ్లుగా సుజిత్ మరో సినిమా చేయలేదు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో సుజిత్ ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. చివరికి పవర్‌స్టార్‌ను మెప్పించిన సుజిత్ ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టైలిష్ అండ్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. దీని కంటే ముందే తమిళ సూపర్‌హిట్ మూవీ ‘‘తేరీ’’ (విజయ్, సమంత నటించారు)ని రీమేక్ చేయాలని పవన్ భావించారట. కానీ సుజిత్ చెప్పిన లైన్ నచ్చడంతో దీనిని పట్టాలెక్కించాలని పవన్ నిర్ణయించినట్లుగా ఫిలింనగర్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments