Bro:పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ సినిమా టైటిల్ ఇదే .. చివరికి అదే ఫిక్సయ్యారుగా, పవర్‌స్టార్ లుక్ మాత్రం కేక
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ తేజ్ కటిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. మేనల్లుడితో జనసేనాని తొలిసారిగా నటిస్తూ వుండటంతో మెగాభిమానులతో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు. తమిళ హిట్ మూవీ ‘‘వినోదయ సీతం’’కు ఇది తెలుగు రీమేక్. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూలై 28న ‘బ్రో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సాయితేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆ లెటర్లోని గడియారం సింబల్‌కి అర్ధం ఏంటీ :
అయితే ఈ సినిమాను PKSDT వర్కింగ్ టైటిల్‌తోనే చిత్రీకరణ చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి ఎలాంటి టైటిల్ పెడతారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించుతూ గురువారం సాయంత్రం 4.14 గంటలకు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని తెలిపింది చిత్ర యూనిట్. చెప్పినట్లుగానే ఈరోజు PKSDT సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేసింది. దీనికి తొలి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే బ్రో (BRO) అన్న పేరును ఫిక్స్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కోసం థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ వెనుక మూవీ నేమ్, అందులోని ‘O’ అన్న లెటర్లో గడియారం వుంది.
తన పాత్రకు షూటింగ్ పూర్తి చేసిన పవన్ :
ఇదిలావుంటే.. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ సినిమాలో పవన్ భగవంతుడి పాత్రలో నటిస్తున్నారు. 20 నుంచి 25 రోజుల పాటు ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. ఇందుకు గాను పవర్ స్టార్ రోజుకు రెండు కోట్లను పారితోషికంగా అందుకున్నారని ఫిలింనగర్ టాక్. తొలిసారిగా సాయిధరమ్ తేజ్, పవన్ కలిసి నటిస్తూ వుండటంతో వారిద్దరిని తెరపై చూడాలని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com