పవర్ స్టార్ జర్నీ చూశారా?

  • IndiaGlitz, [Wednesday,September 02 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు రూపొందించిన ‘పవర్ స్టార్’ జర్నీకి అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతలు, సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. #HBDpawankalyan అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది.

1996 నుంచి ఇప్పటి వరకూ విడుదలైన పవన్ చిత్రాలలోని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సీన్స్‌తో ఈ వీడియోను రూపొందించారు. బ్యాక్ గ్రౌండ్‌లో పలువురు సినీ సెలబ్రెటీలు పవన్ గురించి వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను జత చేశారు. మొత్తంగా ఈ వీడియో అభిమానులకు ఒక ఐ ఫీస్ట్‌లా రూపొందించారు. ‘ది జర్నీ ఆఫ్ పవర్ స్టార్‌’ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వేలల్లో వ్యూస్, లైక్స్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ చిత్రబృందం కూడా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ మోహన్ పోస్టర్‌ను పవన్ బర్త్ డే కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'పింక్' తెలుగు రీమేక్‌ ‘వకీల్‌సాబ్’ సినిమాతో పవన్ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.