రామ్ చరణ్ బ్రూస్ లీ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు. డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. బ్రూస్ లీ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా బ్రూస్ లీ రామ్ చరణ్ వెళ్లి సర్ధార్ సెట్ లో పవన్ కళ్యాణ్ ని కలిసారు. బ్రూస్ లీ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా పవన్ చరణ్ ని అభినందించారు.
బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్యానర్ లో...అబ్బాయ్ చరణ్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదంతా చూస్తుంటే...అబ్బాయ్ చరణ్ కి..బాబాయ్ పవన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడన్న విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో అబ్బాయ్ - బాబాయ్ ఇద్దరు కలసి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com