సాయిధరమ్ పవర్ ఫుల్ టైటిల్...

  • IndiaGlitz, [Saturday,June 04 2016]

వరుస విజయాలతో ముందుకెళ్తున్న మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా సుప్రీమ్ చిత్రంతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ చేయబోయే చిత్రాల్లో రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవితో డైరెక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ నిర్మిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ చిత్రానికి సోల్జర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ టైటిల్ అయితే ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని యూనిట్ భావిస్తోందట.