బుల్లితెరపై పవర్ స్టార్...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ బుల్లితెర పై దర్శనమివ్వనున్నాడట. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని డబ్ చేసి ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసారంటే ఈ ప్రొగ్రామ్ కి ఎంతటి స్పందన లభించిందో తెలుస్తుంది.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమాజానికి ఉపయోగపడేలా ఉండే ఓ మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారట. ఇంతకీ పవర్ స్టార్ తో బుల్లితెర ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుంది ఎవరో కాదు ఈనాడు అధినేత రామోజీరావు అని సమాచారం. బుల్లితెరపై ఎంట్రీ ఇస్తే...ప్రజలకు మరింత చేరువ కావచ్చని...తద్వారా జనసేన పార్టీకి ఎంతో మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాడట పవన్. మరి...ఇదే కనుక నిజమైతే...వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com