Pawan kalyan: ‘‘ మేజర్ ’’కు పవర్‌స్టార్ అభినందనలు.. ఇండస్ట్రీకి అడివి శేష్ లాంటి వారే కావాలన్న పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన చిత్రం ‘‘మేజర్’’. దేశభక్తి ప్రధానంగా రూపొందించిన ఈ సినిమాకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు దానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సైతం ‘‘మేజర్’’ యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ముంబైలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొందని పవన్ తెలిపారు. నాడు చేసిన కమెండో ఆపరేషన్‌లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి పవన కళ్యాణ్ అభినందనలు తెలియచేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించానని.. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందంగా వుందన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలని పవన్ ఆకాంక్షించారు. పార్టీ, రాజకీయ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా వీక్షించలేదని.. త్వరలోనే చూస్తానని పవర్ స్టార్ తెలిపారు.
మహేశ్‌కు ప్రత్యేక అభినందనలు:
హీరో అడివి శేష్‌కి పవన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రఖ్యాత రచయిత దివంగత అడివి బాపిరాజు మనవడైన శేష్ సినిమాలో భిన్న శాఖలపై పట్టున్న సృజనశీలి అని పవర్‌స్టార్ ప్రశంసించారు. తెలుగు సాహిత్యంపై మక్కువ... వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుందన్నారు. ఇలాంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శశికిరణ్ శుభాకాంక్షలు తెలిపిన పవర్‌స్టార్ ఆయన నుంచి ఇంటివంటి సినిమాలు రావాలని కోరారు. ‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబు, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలను పవన్ ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించిన ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మ, సాంకేతిక నిపుణులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments