Pawan - Sujeeth : సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్.. మండే సూర్యుడికి ఎదురుగా పవన్, ఫ్యాన్స్‌కి పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి జోరుమీదున్నారు. రాజకీయాలతో బిజిబిజీగా వుంటోన్న ఆయన గ్యాప్‌లో సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో వున్నారు. ఇది సెట్స్ మీద వుండగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా పవన్ మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపారు. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటించనున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అంతా దీనిని పుకారుగా కొట్టేశారు. పవన్ ఇప్పుడున్న బిజీలో మరే సినిమాకు ఓకే చెప్పరని కొందరంటే.. సుజిత్‌తో సినిమా అంటే కష్టంలే అంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.
తొలుత గాలివార్తగా పవన్-సుజిత్ కాంబినేషన్:
అయితే అందరి మబ్బులు విడిపోయేలా.. ఈ వార్తే నిజమై కూర్చొంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘‘పవన్- సుజిత్’’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. ఆదివారం 8.55 గంటలకు అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పవన్ వెనుకవైపు నిలబడి వున్నట్లు కనిపిస్తున్నాడు. దానిపై ‘‘They Call Him #OG ’’ అని రాసి వుంది.
సాహో తర్వాత మరో సినిమా చేయని సుజిత్:
ప్రభాస్‌తో తెరకెక్కించిన సాహో నిరాశ పరచడంతో గత మూడేళ్లుగా సుజిత్ మరో సినిమా చేయలేదు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో సుజిత్ ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. చివరికి పవర్‌స్టార్‌ను మెప్పించిన సుజిత్ ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టైలిష్ అండ్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. దీని కంటే ముందే తమిళ సూపర్‌హిట్ మూవీ ‘‘తేరీ’’ (విజయ్, సమంత నటించారు)ని రీమేక్ చేయాలని పవన్ భావించారట. కానీ సుజిత్ చెప్పిన లైన్ నచ్చడంతో దీనిని పట్టాలెక్కించాలని పవన్ నిర్ణయించినట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com