Pawan Kalyan, Balakrishna:బాలయ్యతో చేయి కలిపిన పవన్.. రెండు కళ్లు చాలడం లేదుగా, ఫోటో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణలు సొంత అన్నదమ్ముల్లా మసలుతారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు మరొకరు హాజరవుతూ వుంటారు. ఇక చరణ్- ఎన్టీఆర్‌లు మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరూ కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మెగా నందమూరి కుటుంబాల మధ్య వున్న అడ్డుగోడను తొలగించడమే కాకుండా రికార్డులు తిరగరాసింది.
మాస్‌కు కేరాఫ్‌గా పవన్- బాలయ్య (Pawan - Balayya) :
ఇక చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్‌కు కూడా నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం వుంది. బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండేవి. కానీ ఇవి బహిరంగంగా కనిపించేవి కావు. మాస్‌కు కేరాఫ్‌గా నిలిచే పవన్ కల్యాణ్, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోట్లాది మంది అభిమానుల కల. అలాంటిది ఈ ఇద్దరూ ఒకే చోట చేరితే.. ఫ్యాన్స్‌కి పండగే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న వీరసింహా రెడ్డి షూటింగ్ సెట్స్‌లో పవన్ సందడి చేశారు.
పక్కపక్కనే హరిహర వీరమల్లు, వీరసింహారెడ్డి (Hari Hara Veera Mallu - Veera Simha Reddy)షూటింగ్ :
ఆయన హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ఆ పక్కనే బాలయ్య వున్నట్లు తెలుసుకున్న పవన్ .. వీర సింహారెడ్డి సెట్‌కు వెళ్లారు. బాలయ్య, చిత్ర యూనిట్‌లను అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వీరసింహారెడ్డి మంచి విజయం సాధించాలని పవర్ స్టార్ ఆకాంక్షించారు.
త్వరలో అన్‌స్టాపబుల్‌గా గెస్ట్‌గా పవన్ (Pawan):
ఇదిలావుండగా బాలయ్య హోస్ట్‌గా ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 2కు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం వుంది. సీజన్ 1లోనే పవన్ వస్తారని ప్రచారం జరిగినా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. కానీ ఈ సారి అల్లు అరవింద్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని పవన్‌ని ఒప్పించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, క్రిష్‌లు కలిసి ఈ ఎపిసోడ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments