Harish Shankar-Theri Remake: నా చావుకు కారణం హరీశ్ శంకర్: పవన్ అభిమాని సూసైట్ నోట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ , దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ‘‘భవదీయుడు భగత్‌సింగ్’’ అంటూ టైటిల్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. తీరా దీనిని పక్కనబెట్టి రీమేక్ సినిమాను పట్టాలెక్కించాలని భావించారట. అది ఏదో సినిమా అయితే బాగానే వుండేది. కానీ ఇళయ దళపతి విజయ్ , సమంతలు నటించిన ‘‘తేరీ’’ (తెలుగులో పోలీసోడు)ను రీమేక్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో పవన్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. తేరీ రీమేక్ చేస్తే ఒప్పుకునేది లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే తేరీ వద్దంటూ ‘‘ #WeDontWantTheriRemake’’ హ్యాష్ ట్యాగ్‌తో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ఏకంగా సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది. మా టీవీలో ఎన్నో ఆదివారాలు తేరీని చూసేశామని, మళ్లీ దీనిని రీమేక్ చేయడం ఏంటంటూ ఆమె మండిపడుతోంది. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని.. కనీసం తన చావుతోనైనా ‘‘తేరీ’’ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని చెబుతూ.. తన చావుకి కారణం దర్శకుడు హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ అంటూ సూసైట్ నోట్ రాసింది. అసలే మంచి వేడి మీద వున్న పవన్ ఫ్యాన్స్ ఈ సూసైడ్ నోట్‌ను వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై హరీశ్ శంకర్, మైత్రీ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments