'వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' : పోసానికి తన స్టైల్లో కౌంటరిచ్చిన పవన్
- IndiaGlitz, [Tuesday,September 28 2021]
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ టికెట్ విధానంతో పాటు పరిశ్రమలోని సమస్యలపై తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ మంత్రుల్నే కాకుండా నేరుగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. దీంతో ఆ రోజు నుంచి వైసీపీ నేతలు - పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న వైసీపీ సర్కార్ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
వైసీపీ … ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ మరియు రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని… కానీ వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. అంతేకాదు వాగ్దానాలు నెరవేర్చకపోగా ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు . ఈ మేరకు ట్వీట్టర్‌లో ఓ టేబుల్ పోస్ట్ చేశారు.
అయితే పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం మీడియా ముందుకు రావడంతో పవర్‌స్టార్ మరింత చెలరేగిపోయారు. పోసాని ప్రెస్‌మీట్ పూర్తయిన కొద్దిసేపటికే పవన్ నాలుగు లైన్లు ట్వీట్ చేశారు.
''తుమ్మెదల ఝుంకారాలు .. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …'' నంటూ సదరు ట్వీట్‌లో దుయ్యబట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తుమ్మెదల ఝుంకారాలు
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …