పవన్ స్టార్ట్ చేసేస్తున్నాడు..
Monday, May 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత నెలలో సర్ధార్ గబ్బర్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆతర్వాత ఆదే నెలలో కొత్త సినిమా ప్రారంభించాడు. ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాత. ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
వచ్చే నెల 2 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేసారు. పొల్లాచిలో పవన్, ఇతర ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫ్యాక్షన లీడర్ ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో రొమాన్స్ తో పాటు ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి కథ ఆకుల శివ అందించగా, అనూప్ సంగీతం అందిస్తున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ తో సక్సెస్ సాధించలేకపోయిన పవన్ ఈ చిత్రంతోనైనా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments