`పవర్ ప్లే` ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి టీమ్ అందరికీ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ - ``మా `పవర్ ప్లే` మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రానాగారికి దన్యవాదాలు. పోస్టర్ లో రాజ్ తరుణ్ లుక్ ఎలా డిఫరెంట్‌గా ఉందో.. సినిమా కూడా అలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్ తరుణ్ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్లో భిన్నమైన థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. `` అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``విజయ్ కుమార్ గారితో `ఒరేయ్ బుజ్జిగా..` లాంటి మంచి ఎంటర్టైనర్ చేశాను. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఒక సరికొత్త జోనర్లో డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ చేస్తున్నాను. నాకు ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది`` అన్నారు.
నిర్మాతలు మహిదర్, దేవేష్ మాట్లాడుతూ - ``ఒరేయ్ బుజ్జిగా..లాంటి సూపర్‌హిట్ తర్వాత రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరి అంచనాలను అందుకునేలా విజయ్‌కుమార్ గారు చాలా బాగా తీశారు. థ్రిల్లర్ జోనర్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది`` అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలపర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - ``చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది`` అన్నారు.
రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments