షాక్ కొట్టించిన కరెంటు బిల్లు.. సింగిల్ బెడ్రూంకి రూ.25 లక్షలు

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

తెలంగాణలో కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో కానీ.. బిల్లు చూస్తే మాత్రం కొట్టడం ఖాయం అనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలల పాటు రీడింగ్ తీయకపోవడంతో ఒక్కొక్క ఇంటికి కనీవినీ ఎరుగని రీతిలో బిల్లొస్తోంది. కొందరికైతే లక్షల్లో బిల్లు రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని లాలాపేట్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

లాలాపేట్‌లోని జనప్రియ అపార్ట్‌మెంటులోని సింగిల్ బెడ్‌రూమ్‌లో కృష్ణమూర్తి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి రీడింగ్ తీసి.. రూ.25,22,467 బిల్లు చేతిలో పెట్టారు. మార్చి 6 నుంచి జులై 6 తేదీల మధ్య 3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినట్లు నిర్ధారించారు. బిల్లు చూడగానై షాకైన కృష్ణమూర్తి తార్నాకలోని విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు మీటర్ లోపంగా గుర్తించి కొత్త మీటరు బిగించి రూ.2095 బిల్లు వేశారు. దీంతో కృష్ణమూర్తి ఊపిరి పీల్చుకున్నాడు.