ఏపీలో ఏం నడుస్తుంది.. "ఉల్లిగడ్డ.. ఆలుగడ్డ".. నడుస్తుంది..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఏం నడుస్తుందంటే ఉల్లిగడ్డ రచ్చ నడుస్తుందంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉల్లిగడ్డ మీద ట్రోల్స్ కనపడుతున్నాయి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం జగన్ శుక్రవారం తిరుపతి జిల్లాకు వెళ్లారు. అక్కడ వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని తడబడ్డారు. పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. వారు బంగాళాదుంప అని చెప్పగా.. ఆయన నవ్వుకుంటూ 'ఆ.. బంగాళాదుంప' అన్నారు.
ఇక అంతే ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ దీనిని ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదా అంటూ ట్రోల్స్ చేస్తుంది. వీడియోలు, కామెడీ ఎమోజీలు చేస్తూ జగన్‌ను ఓ ఆట ఆడుకుంటుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా సీఎం జగన్‌కు బంగాళదుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు కూడా ఏపీలో ఏం నడుస్తుంది.. ఉల్లిగడ్డ, పొటాటో నడుస్తుంది అంటూ స్పూఫ్ వీడియోలు, మీమ్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌కు వైసీపీ అభిమానులు కూడా ధీటుగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. రాయలసీమలో ఆలుగడ్డని ఉర్లగడ్డ అంటారని కౌంటర్ ఇస్తూ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.
ఇక "బంగాళదుంపని రాయలసీమలో ఉల్ల గడ్డ అని పిలుస్తారు. అలానే ఉల్లిపాయని ఎర్రగడ్డ అని పిలుస్తుంటారు. సీమలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు, అలాంటిది మేం రాయలసీమ వాసులం అని చెప్పుకునే మీ చంద్రబాబుకి, మీకు ఆ విషయం తెలియకపోవడం మీకు సీమ యాస, భాష పట్ల ఏమాత్రం జ్ఞానం ఉందో అర్ధమవుతుంది. అది రాయలసీమ యాస, భాష.. దాన్ని మీరు గుర్తించలేదు కాబట్టే 2019 ఎన్నికల్లో మీకు 3 సీట్లు వచ్చాయి" అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
ఇందుకు టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ "సీమలో అయితే "ఉల్ల గడ్డ" అనే అంటారు. మీ వాడికి అది తెలియదు కాబట్టే "ఉల్లిగడ్డ" అంటాడు. మళ్ళీ రాయలసీమ ముద్దు బిడ్డ అని డబ్బులిచ్చి డప్పు. మీ వాడికి సీమలో పలికే ఉల్లగడ్డ తెలియదు, ఆంధ్రాలో పలికే బంగాళదుంప తెలియదు. నీకు అసలు ఏ యాసా తెలియదు. అందుకే కాస్తో ఇస్కిస్తో లాంటి కొత్త పదాలు కనిపెట్టాడు. గడ్డ ఏదో, దుంప ఏదో తెలియకే కదా, ప్రజల నోట్లో మట్టి గడ్డలు కొట్టాడు. దమ్ము గురించి, పరదాలు కప్పుకుని తిరిగే మీరే చెప్పాలి" అంటూ ట్వీట్ చేసింది.
మొత్తానికి ప్రస్తుత డిజిటల్ కాలంలో కీలకమైన పదవుల్లో ఉన్న వారు ఓ మాట తప్పుగా జారితే సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి నోటి నుంచి తప్పు పదం వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం జరిగే ట్రోల్సే ఉదాహరణగా నిలుస్తున్నాయి. అందుకే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే నేతలు ప్రతి పదం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com