పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న 'బంతిపూల జానకి'

  • IndiaGlitz, [Sunday,May 01 2016]
ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న "బంతిపూల జానకి" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.ధన్ రాజ్-దీక్షపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రామ్-తేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఈ చిత్రంలో ఇతర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న మా "బంతిపూల జానకి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే మూడవ వారంలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం కోసం మా మ్యూజిక్ డైరెక్టర్ బోలె బ్రహ్మాండమైన బాణీలు ఇవ్వడంతో పాటు రీ-రికార్డింగ్ తో సినిమాకు జీవం పోస్తున్నారు. ఇక మా హీరో ధన్ రాజ్ మరియు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వేసవిలో వినోదాల తొలకరి జల్లు కురిపించనున్న "బంతిపూల జానకి".. ఈ ఏడాది పెద్ద విజయం సాధించే చిన్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను" అన్నారు.

More News

విడుదల సన్నాహాల్లో 'మదగజరాజ'

సూపర్ మాస్ హీరో విశాల్-గ్లామర్ క్వీన్స్ అంజలి-వరలక్ష్మీశరత్ కుమార్ జంటగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్ సి.దర్శకత్వంలో రూపొందిన 'మదగజరాజ'

అభిమానులకు సుప్రీమ్ పాటను చూపించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,పటాస్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపిందిన చిత్రం సుప్రీమ్.

విక్ర‌మ్ కి తెలుగు హీరోలు క‌న‌ప‌డ‌లేదా..?

చెన్నై వ‌ర‌ద‌ల భీభ‌త్సం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది.  టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం క‌దిలివ‌చ్చి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల్ని అందించారు. ముఖ్యంగా  తెలుగు యువ‌ క‌థానాయ‌కులు అంతా క‌ల‌సి ఒక టీమ్ గా ఏర్ప‌డి చెన్నై కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసారు.

ఫిలిం మేకర్స్ కంటే ఆడియెన్స్ తెలివైనవాళ్లు - హీరో సూర్య

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’.

బి.జె.పి కి వార్నింగ్ ఇచ్చిన‌ ప‌వ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ గ‌త కొన్ని రోజులుగా కేంద్రాన్ని అడుగుతున్న‌ప్ప‌టికీ...అదిగో..ఇదిగో అంటుంది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా పై ఏ విష‌యం చెప్ప‌లేదు.