సూర్య కొత్త సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్

  • IndiaGlitz, [Monday,November 30 2015]

అప‌జ‌య‌మెరుగ‌ని కాంబినేష‌న్ ల్లో క‌థానాయ‌కుడు సూర్య‌, ద‌ర్శ‌కుడు హ‌రి కాంబినేష‌న్ ఒక‌టి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగు చిత్రాలు స‌క్సెస్ అయ్యాయి. 'ఆరు, వేల్ (దేవా), సింగం (య‌ముడు), సింగం 2' చిత్రాలే ఆ నాలుగు సినిమాలు. అలాంటి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఐదో చిత్రంగా 'సింగం 3 ' రానుంది.

అనుష్క‌, శ్రుతి హాస‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకి హేరిస్ జైరాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సెలెక్ట్ అయ్యాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో.. 'సింగం 3'పై పాజిటివ్ వైబ్రేష‌న్స్ మ‌రింత‌గా పెరుగుతున్న‌ట్ల‌య్యింది. ఎందుకంటే.. సూర్య‌, హ‌రిది అప‌జ‌య‌మెరుగ‌ని క‌ల‌యిక అయితే.. సూర్య‌, హేరిస్ ది మ్యూజిక్ ప‌రంగా నిరాశ‌ప‌ర‌చ‌ని కాంబినేష‌న్‌. సూర్య‌, హ‌రికి వేర్వేరుగా క‌లిసొచ్చిన హేరిస్.. వారిద్ద‌రి కాంబినేష‌న్ సినిమాకి మ్యూజిక్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ ముగ్గురి క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.